ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

1
TMedia (Telugu News) :

ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

 

టీ మీడియా,సెప్టెంబర్ 27, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టిన విచార‌ణ‌ను తొలిసారి లైవ్‌లో ప్ర‌సారం చేశారు. శివ‌సేన‌కు సంబంధించిన కేసును ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన కేసును ధ‌ర్మాస‌నం విచారించింది. సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధ‌ర్మాస‌నం విచారిస్తున్న కేసుల్ని లైవ్‌లో ప్ర‌సారం చేయాల‌ని గ‌త‌వారం సుప్రీంకోర్టు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.సీజేఐ యూయూ ల‌లిత్ నేతృత్వంలో గ‌త‌వారం ఏక‌గ్రీవం నిర్ణ‌యం తీసుకున్నారు.

Also Read : ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా

రాజ్యాంగ ధ‌ర్మాస‌నం విచారిస్తున్న కేసుల్ని లైవ్ చేయాల‌ని 2018, సెప్టెంబ‌ర్ 27వ తేదీన ఆ నాటి సీజేఐ దీప‌క్ మిశ్రా తెలిపారు. దాని ప్ర‌కార‌మే యూట్యూబ్‌లో సుప్రీం విచార‌ణ‌ను ప్ర‌సారం చేస్తున్నారు. అయితే యూట్యూబ్‌కు బ‌దులుగా త్వ‌ర‌లోనే స్వంత ఫ్లాట్‌ఫామ్‌పై సుప్రీం విచార‌ణ‌ల‌ను లైవ్ చేయ‌నున్న‌ట్లు సీజే ల‌లిత్ పేర్కొన్నారు. ఈ లైవ్ ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌లు త‌మ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్ల‌లో వీక్షించ‌వ‌చ్చు. అయితే ఆగ‌స్టు 26వ తేదీన మాజీ సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ వెబ్ పోర్ట‌ల్ ద్వారా లైవ్ ప్ర‌సారాల‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube