సుప్రీంకోర్టులో లైవ్ స్ట్రీమింగ్‌

71 ఏళ్ల చ‌రిత్ర‌లో తొలిసారి

1
TMedia (Telugu News) :

సుప్రీంకోర్టులో లైవ్ స్ట్రీమింగ్‌

– 71 ఏళ్ల చ‌రిత్ర‌లో తొలిసారి

టీ మీడియా, ఆగస్టు 26, న్యూఢిల్లీ: 71 ఏళ్ల సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో తొలిసారి విచార‌ణ‌లు లైవ్‌లో ప్ర‌సారం చేశారు. అయితే లైవ్ స్ట్రీమింగ్‌ను కేవ‌లం సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ వీడ్కోల కోసం మాత్ర‌మే వాడారు. సంప్ర‌దాయం ప్ర‌కారం.. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌తో పాటు త‌దుప‌రి సీజే ఉన్న ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. ఎన్వీ ర‌మ‌ణ ఇవాళ రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. జ‌స్టిస్‌ యూయూ ల‌లిత్ 49వ సీజేగా విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు.

 

Also Read : విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం

ఎన్ఐసీ వెబ్ పోర్ట‌ల్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని లైవ్ చేశారు. రాజ్యాంగప‌రంగా కీల‌క‌మైన కేసుల‌కు సంబంధించిన విచార‌ణ‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు గ‌తంలో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం అనుమ‌తి ఇచ్చింది. 2018, సెప్టెంబ‌ర్ 26వ తేదీన అప్ప‌టి సీజే దీప‌క్ మిశ్రా, జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ తీర్పును వెలువ‌రించింది. అయితే సీజేఐ ర‌మ‌ణ రిటైర్మెంట్ లోపే లైవ్ ప్ర‌సారాల‌ను ప్రారంభించాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు తీర్మానించింది. కేసుల లైవ్ ప్రసారాల కోసం సుప్రీంకోర్టుకు చెందిన ఈ-క‌మిటీ ఇండిపెండెంట్ ఫ్లాట్‌ఫామ్‌ను డెవ‌ల‌ప్ చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube