ఇన్స్టంట్ రుణాలు,లోన్ యాప్ రుణాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

0
TMedia (Telugu News) :

ఇన్స్టంట్ రుణాలు,లోన్ యాప్ రుణాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

టీ మీడియా, ఆగస్టు 06, నంద్యాల:

సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టెంట్ రుణాలు, లోని యాప్ రుణాల పై ప్రజలందరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గూగుల్ ప్లే స్టోర్ లో వందలాదిగా లోన్ యాప్ రుణాలు దర్శనమిస్తున్నాయి. అందులో RBI అనుమతులు పొందినవి కొన్ని ఉన్నాయి. అనుమతులు లేని వాటిలో రుణాలు తీసుకోవడం ఎప్పటికైనా ఇబ్బందేనని అంతేకాక లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే తమ వ్యక్తిగత సమాచారం(మీ కాంటాక్ట్స్, ఫొటోలు , వీడియోలు,మైక్రో ఫోన్, కెమెరా మొదలైనవి ) మొత్తం వారి చేతులలోకి వెళ్ళిపోతుంది. అధిక శాతంలో వడ్డీలు కట్టలేని వారిని , EMI లు కట్టలేని వారిపై మానసికంగా వేధించడం,బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుందన్నారు మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని అసభ్యముగా గానీ అశ్లీలంగా గానీ మీ కాంటాక్ట్స్ కు పంపడం లాంటి బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. కావున వీటిపై అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు. ఈ మధ్యకాలంలో లోన్ యాప్ రుణాలు నిర్వాహకుల వేధింపులు తాళలేక చాలామంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు ,ప్రైవేటు వ్యక్తులు, నిరుద్యోగ యువత ఇలా చాలామంది ఈ లోన్ ఆప్ మరియు ఇన్స్టంట్ రుణాల నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఇబ్బందులు పడుతు మానసిక వేదనకు గురవుతున్నారు.

 

Also Read : మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా

 

నంద్యాల జిల్లా ప్రజలకు పోలీసుల తరపున విజ్ఞప్తి ఏమనగా సులభముగా లోన్ వస్తుందని, సమయానికి లేదా తొందరగా డబ్బులు వస్తాయని ఇతర ఆకర్షణలకూ లోనై ప్రమాదకరమైన లోన్ యాప్స్ వలలో పడకండి, మీ వ్యక్తిగత సమాచారం మీరే ఇచ్చి మీతో పాటూ మీ కుటుంబసభ్యుల, ముఖ్యముగా మహిళల, స్నేహితుల, ఇతర శ్రేయోభిలాషుల సమాచారాన్ని ప్రమాదంలో పెట్టకండి.
మరికొందరు ఆన్లైన్లో మీరు ఏమి ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్లైన్లో డెలివరీ వచ్చిందని OTP చెప్పాలని ఎవరైనా కాల్ చేస్తే అటువంటి కాల్స్ నమ్మవద్దని OTP లు చెప్పవద్దని తెలిపారు.గూగుల్ ప్లే స్టోర్ లో దర్శనమిస్తున్న లోన్ యాప్, ఇన్స్టంట్ రుణాలు యాప్ లను నమ్మవద్దని నంద్యాల జిల్లా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వీటి పేరుతో నిరుద్యోగ యువతను ఆకర్షించి రుణాలు తీసుకున్న బాధితులపై తీవ్ర వేధింపులకు గురిచేసి వారి జీవితాలను ఆగం చేస్తున్నారు లోన్ తిరిగి చెల్లించిన ఇంకా చెల్లించాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితులలో లోన్ తీసుకున్న వారి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారిని కూడా అశ్లీల పరిజాలంతో మానసిక క్షోభకు గురి చేసి వారి జీవితాలతో ఆటలాడుతున్నారు ఇలాంటి లోన్ యాప్ ఇన్స్టెంట్ రుణాలు యాప్ మొదల వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు.ఎవరైనా మానసిక వేదనకు గురి చేస్తున్న, ఇబ్బంది పెడుతున్న ,బ్లాక్ మెయిల్ చేస్తున్న అలాంటి వారి గురించి భయపడకుండా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలియజేస్తూ ఎవరైనా ప్రజలను వేధింపులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube