సుడా కార్యాలయం కు తాళాలు

మున్సిపల్ కార్యాలయం విధులకు సిబ్బంది

0
TMedia (Telugu News) :

సుడా కార్యాలయం కు తాళాలు

– మున్సిపల్ కార్యాలయం విధులకు సిబ్బంది

– గోడకు కేసీఆర్ ఫోటో నే

– ఆందోళన లో అనుమతి లేని వెంచర్ల ప్లాట్ కొనుగోలు దార్లు

టి మీడియా, డిసెంబర్ 18, ఖమ్మం సిటీ : స్థానిక గట్టయ్య సెంటర్ లోని స్థంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) కార్యాలయం మూసి వేశారు. తాళం వేసిన ఆ కార్యాలయం బయటా, లోపల మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఫోటో లు సోమవారం వరకు అలానే ఉన్నాయి. కార్యాలయం క్రిందభాగం మాత్రం వాచ్ మెన్ కుటుంబం నివాసం ఉన్నది. వాచ్ మెన్ గురించి వాకబ్ చెయ్యగా లేరన్న సమాధానం వచ్చింది.అక్కడి సిబ్బంది మున్సిపల్ కార్యాలయం లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సుడా తో పాటు 54 కార్పొరేషన్ ల నామినేటెడ్ పోస్ట్ ల ను రద్దు చేసిన విషయం విధితమే. ఇప్పటికే సుడా పై పలు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేకుండా వెంచర్ లు వేయడం, తమవి కానీ వెంచర్లకు అందమైన బ్రోచర్లతో జనం వద్ద అడ్వాన్స్ లు తీసుకొని టోకరా వేశారు కొంతమంది. అటువంటి అక్రమార్కులు విషయం దృష్టికి వస్తే వారి పై చర్యలకు బదులుగా సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా కోట్లు ఆర్ధిక లబ్ది పొందారని సుడా పాలక వర్గంపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో జరిగిన అక్రమాలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయాని అక్కడి సిబ్బంది ఎవరికి వారు మున్సిపల్ కార్యాలయం కు జంప్ అయినట్లు గా తెలుస్తోంది.

Also Read : సింగరేణి ఎన్నికలపై విచారణ హైకోర్టులో వాయిదా

ఫైల్స్ భద్రమేనా.?
సుడా కార్యాలయంకు తాళం ఎవరు వేశారు? తాళంచెవులు ఎవరి వద్ద ఉన్నాయి, అక్కడ ఉన్న ఫైల్స్ భద్రమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద సుడా ఉన్నదా లేదా, మా ప్లాట్లు రిజిస్టేషన్ అవుతాయా అన్న ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube