ఇరుపక్షాల కు విజయ వేదిక లోక్ అదాలత్

జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు

1
TMedia (Telugu News) :

ఇరుపక్షాల కు విజయ వేదిక లోక్ అదాలత్
– జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు

టీ మీడియా,ఆగష్టు,6,ఖమ్మం : ఇరుపక్షాల విజయమే లోక్ అదాలత్ ధ్యేయమని, వివాదంలో ఉన్న ఇరుపక్షాలకు విజయం చేకూర్చే వేదిక లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పి శ్రీనివాసరావు అన్నారు.శుక్రవారం జిల్లా కోర్టుహాలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ నెల 13న ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం జాతీయ లోక్ అదాలత్న నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా లోకదాలత్ విధివిధానం, లాభాలను ఆయన వివరించారు. ఈ లోక్ అదాలత్ 5 క్రిమినల్ కేసులో 13 వేల పెట్టి కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లక్ష్యసాధనకు పోలీసు అధికారులు న్యాయవాదులు న్యాయమూర్తులు బీమా కంపెనీ వారు సహకారం అందిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అఖిలభారత జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సైతం లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించారన్నారు.

 

Also Read : మన ఆరోగ్యం మన చేతుల్లోనే

 

భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ముద్దాయిల సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కువ కాలం జైలులో ఉన్న విచారణ ఖైదీల విడుదలకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. లోక్ అదాలత్ లాభాలను గుర్తించి కక్షిదారులందరూ తమ కేసులను రాబోయే జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం లభించడమే కాక ఎలాంటి డబ్బు ఖర్చు కాదని కాలయాపనలేని అంతిమ శాశ్వత తీర్పు లభిస్తుందని ఆయన తెలిపారు.పాత్రికేయుల సమావేశంలో న్యాయసవాధికార సంస్థ న్యాయమూర్తి మహ్మద్ జావీద్ పాషా, న్యాయవాదులు ఇమ్మడి లక్ష్మీనారాయణ, జీవీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube