లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సమావేశం వాయిదా

లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సమావేశం వాయిదా

0
TMedia (Telugu News) :

లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సమావేశం వాయిదా

టీ మీడియా, నవంబర్ 7, న్యూఢిల్లీ : డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రాపై ముసాయిదా నివేదికను రూపొందించేందుకు జరగాల్సిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 7న కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించారు. సమావేశం ఈ నెల 9కి వాయిదా వేశారు. వాయిదాకు కారణం ఏమిటనేది అధికారికంగా వెల్లడించలేదు. మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై బిజెపి ఎంపి వినోద్‌ కుమార్‌ సోంకర్‌ అధ్యక్షతన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ విచారణ జరుపుతోంది. ఎథిక్స్‌ కమిటీ సభ్యులు ఇంతకు ముందు ఈ నెల 2న సమావేశమైనప్పటికీ పార్టీలవారీగా విడిపోయారు. 15 మంది సభ్యుల కమిటీలో మెజారిటీ సభ్యులు బిజెపికి చెందినవారే కావడంతో మహువా మొయిత్రాపై కఠిన చర్యలు ఉండవచ్చనే అభిప్రాయం ఉంది.

Also Read : పిటి జెడ్ కెమెరాలతో నిరంతరం నిఘా

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube