లక్ష్మీకటాక్షం, సంపదల కోసం చూస్తున్నారా

ఈ లక్షణాలు ఉంటేనే సాధ్యమంటున్న చాణక్య.

0
TMedia (Telugu News) :

లక్ష్మీకటాక్షం, సంపదల కోసం చూస్తున్నారా..?

– ఈ లక్షణాలు ఉంటేనే సాధ్యమంటున్న చాణక్య..

లహరి, ఫిబ్రవరి 1, ఆధ్యాత్మికం : పెద్దలు చెప్పిన కష్టే ఫలి అనే మాట మనందరికీ తెలిసిందే. నిజంగా కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. నీరసంగా, అలసత్వంగా కూర్చుంటే మనతో పాటు ఉన్నవారు కూడా మనల్ని దాటుకుని ముందుకు సాగుతారు. కానీ మనం కూర్చున్న చోటే ఉండిపోతాం. అందువల్ల కష్టపడితేనే ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు పెద్దలు. ఈ నేపథ్యంలోనే ఆచార్య చాణక్యుడు కూడా పలు నీతి సూక్తులను బోధించాడు. మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్తగా ప్రసిద్ధి పొందిన ఆచార్య చాణక్యుడు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ అనేక పుస్తకాలను రచించాడు. ఆయన చెప్పిన నీతి సూత్రాల కారణంగా ఆయనకు కౌటిల్యుడు అనే పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం కూడా చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.

ఇక ఈ చాణక్య నీతి గ్రంధంలో అనేక అంశాలను ఆచార్యుడు ప్రస్తావించాడు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మానవ జీవితంలో సంపదలు పోగు చేసుకోవడానికి, లక్ష్మీ కటాక్షం పొందాడానికి ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలనే విషయాలను కూడా లిఖించాడు ఆచార్యుడు. మరి చాణక్య నీతి ప్రకారం ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నవారికి సంపదలు, లక్ష్మీ కటాక్షం లభిస్తుందనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కష్టపడే లక్షణం: కష్టపడి పని చేసే వారిపై లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చాణక్యుడు చెప్పాడు. శ్రద్ధగా పని చేసే వ్యక్తులు వారి జీవితంలో సంపదలను సృష్టిస్తారని కూడా అన్నాడు చాణక్యుడు.కష్టించే గుణాలు ఉన్నావారు అవకాశాలను సృష్టించుకుని వాటి దాని ద్వారా ప్రయోజనం పొందుతారని చాణక్య బోధించాడు. ఆయన రచించిన చాణక్య నీతి ప్రకారం కష్టపడటాన్ని అలవాటుగా చేసుకోవాలి. శ్రమించే వారికే సంపద, శ్రేయస్సు సిద్ధిస్తాయి. సోమరితనం, క్రమశిక్షణ లేనివారు ఎప్పుడూ సంపదను పోగు చేయలేరు.
తెలివితేటలు: చాణక్య నీతి ప్రకారం తెలివితేటలు, జ్ఞానం, మంచి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉన్న వ్యక్తులు సంపదను కూడగట్టుకుంటారు. వారు లాభదాయకమైన అవకాశాలను గుర్తించగలరు. తెలివిగా పెట్టుబడులు పెట్టగలరు.
నిజాయితీ: సంపదను పోగు చేసుకోవడానికి నిజాయితీ ఒక కీలకమైన లక్షణం. ఇతరులతో తమ వ్యవహారాల్లో నిజాయితీగా ఉండే వ్యక్తులు ఇతరుల విశ్వాసం, గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. ఇది మరింత వ్యాపార అవకాశాలు, గొప్ప ఆర్థిక విజయాన్ని అనువదించగలదు.

Also Read : అక్రమ సంబంధాల కారణాలు ఏంటో

పొదుపు: పొదుపు అనేది సంపదను కూడబెట్టుకునే వ్యక్తులకు ఉండే ముఖ్యమైన లక్షణం. పొదుపు చేసే వారు ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకుంటారు. తమ డబ్బును ఎలా ఖర్చు చేస్తారనే దాని గురించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.
నెట్ వర్కింగ్: సంపదను కూడబెట్టుకోవడానికి ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం చాలా కీలకం. స్నేహితులు, కుటుంబం, వ్యాపార సహచరుల బలమైన నెట్ వర్క్‌లను కలిగి ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఎక్కువ మద్దతు వ్యవస్థను కలిగి ఉంటారు.
అదృష్టాన్ని ఆశ్రయించనివారు: అదృష్టం వస్తుందని, అదృష్టం వచ్చినప్పుడు సంపద వస్తుందని నమ్మి డబ్బు పొదుపు చేయని వారు ఎప్పటికీ డబ్బు కూడబెట్టలేరు. అందుకే అదృష్టం కోసం ఎదురుచూడకుండా దాని కోసం శ్రమించాలని చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా తెలియజేశాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube