వరద బాధితులకు లారీ యూనియన్ సహయం

జెండా ఊపి ప్రారంభించిన సత్తుపల్లి ఏం ఎల్ ఏ

1
TMedia (Telugu News) :

వరద బాధితులకు లారీ యూనియన్ సహయం

-జెండా ఊపి ప్రారంభించిన సత్తుపల్లి ఏం ఎల్ ఏ

టీ మీడియా,ఆగస్టు 6, సత్తుపల్లి : ది లారీ & టిప్పర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గోదావరి వరదబాధితుల కోసం ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల లారీని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య జండా ఊపి ప్రారంభించారు. ఇటీవల భారీ వర్షాల వల్ల సర్వం కోల్పోయిన వరద బాధితులకు తమ వంతు మానవతా దృక్పథంతో, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు సహాయం చేసి ఆదుకోవాలని యమ్.యల్.ఎ సండ్ర పిలుపుమేరకు స్పందించిన సత్తుపల్లి లారీ యూనియన్ వారు ఒక్కొక్కటి రూ 700 విలువచేసే రెండు వందల నిత్యవసర వస్తువుల సంచులను సిద్దం చేసిన (లక్ష నలభై వేల) బియ్యం, మంచి నూనె, ఉల్లిపాయలు, పంచదార, చింతపండు, ఉప్పు, కారం, పసుపు కందిపప్పు తాలింపు గింజలు, బంగాళాదుంపలు, వాటర్ బాటిల్లను సిద్ధం చేసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య లారీని జండా ఊపి ప్రారంభించారు.

 

Also Read : మోడీ పాలనతో వ్యవసాయ సంక్షోభం

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి విపత్తు వచ్చిన తక్షణం స్పందిస్తున్న లారీ యూనియన్ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కొండవలస గ్రంధాలయ శాఖ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మెన్ శీలపురెడ్డి, హరికృష్ణ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, లారీ యూనియన్ కమిటీ ప్రెసిడెంట్ జేష్ఠ లక్ష్మణరావు, జనరల్ సెక్రటరీ గూడూరు సర్వేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ షేక్ లియాఖత్, సలహాదారులు ఐ.శ్రీనివాసరావు,పి.యల్.ప్రసాద్, వేముల విశ్వనాథం కోశాధికారి షేక్ మౌలాలి, ఆకుల జగదీష్, ధర్మయ్య, కౌన్సిలర్లు నరుకుల్ల శ్రీనివాసరావు, అద్దంకి అనిల్ కుమార్, వేములపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube