ఓట్ల కోసమే నిరుద్యోగులపై ప్రేమ : షర్మిల

ఓట్ల కోసమే నిరుద్యోగులపై ప్రేమ : షర్మిల

0
TMedia (Telugu News) :

ఓట్ల కోసమే నిరుద్యోగులపై ప్రేమ : షర్మిల

టీ మీడియా, అక్టోబర్ 19, హైదరాబాద్‌ : నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు మీరు అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఈ సందర్బంగా ఆమె సోషల్‌ మీడియా అనుసంధాన ఎక్స్‌ వేదికగా తెలంగాణ మంత్రిపై విమర్శలు గుప్పించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి అంటూ మీరు చేసిన మోసాలు చాలు.. ఈ నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని శాపనార్థాలు పెట్టారు. నిన్నటి వరకు టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తోందన్న కేటీఆర్‌ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళన అంటున్నారని, అంటే చిన్నదొర తప్పు అంగీకరించినట్లే కదా? అన్నారు. ఓట్ల కోసం కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పారని, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారని విమర్శించారు. అంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? అన్నారు. ఉద్యోగాలు ఇవ్వమని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మాట్లాడలేదని, కానీ ఇప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని బంకుతున్నాడన్నారు. బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించింది మీరే..పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన అంటున్నది మీరేనని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ.. ఈ దేశానికి సీ టీమ్.

ఈ డ్రామాలన్నీ ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా! ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం.మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం. ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీరు తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube