దళితుడి తో ప్రేమ వివాహం
-కుల బహిష్కరణ గురి అయిన కుటుంబం
– పోలీస్ లకు పిర్యాదు
టీ మీడియా,జనవరి 22, సత్తుపల్లి : తమ కులానికి చెందిన యువతి వేరే కులానికి చెందిన దళిత యువకుడిని పెళ్లి చేసుకుంది అని కుల బహిష్కరణ చెయ్యడం తో పాటు,వారితో మాట్లాడిన వారికి రు:2 వెలు జరిమానా అంటూ కుల పెద్ద హుకుం జరి చేశారు.ఖమ్మం జిల్లా వి ఏం బంజర లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.పోలీస్ లకు పిర్యాదు చేశామని భాదితులు తెలిపారు. పిర్యాదు లో నీ వివరాలు…
శ్రీ మహారాజశ్రీ గౌరవనీయులైన వి.యం. బంజరు పోలీసు స్టేషన్
పెనుబల్లి మండలములోని మండాలపాడు గ్రామకాపురస్తుడు పెండ్ర గోపాలరావు గదివ్యసముఖమునకు అబ్బురం, వయస్సు : 62, కులం : మందుల, వృత్తి : వ్యవసాయం నమస్కరించి వ్రాసి దాఖలు చేసుకొను అర్జీ విన్నపములు
Also Read : వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర..
నా పెద్ద కుమారుడు రాంబాబు ప్రధమ కుమార్తె చి||సౌ|| జీవిత వయస్సు: 20 అనువారు మా గ్రామకాపురస్తుడు హరిజన మాదిగ కులస్థుడు తడికమళ్ళ సంపత్ అనువారిని ప్రేమించి వివాహం చేసుకొన్నది. అందులకు మా మందుల కులం సంఘం వారు వారికి తెలియపరచకుండా వేరే కులస్థుడను చేసుకొన్నదని నెపముతో మా కుల సంఘం వారు 1) ఒంటిఎద్దు సాయిలు సా।। రామానగరం 2) ఒంటిఎద్దు వెంకటేష్ సా॥ కిష్టాపురం 3) చప్పిడి బిక్షాలు సా|| కల్లూరు, 4) సింగజోగి వెంకటేశ్వరరావు సా|| సీతానగరం 5) ఒంటిఎద్దు ముత్యాలు సా॥ కిష్టాపురం, 6) పెండ్ర బాపయ్య సా॥ సత్తుపల్లి 7) ఒంటి ఎద్దు వెంకటేశ్వరరావు సా|| సత్తుపల్లి 8) ఒంటి ఎద్దు చిన్న సాయిలు సా॥ రామానగరం 9) జల్లి సురేష్ సా॥ రామానగరం 10) సింగజోగి భూషణం సా॥ కిష్టాపురం 11) ఒంటిఎద్దు నాగరాజు సా|| కిష్టాపురం 12) పెండ్ర నాని. కుమార్ 13) సింగజోగు వెంకటేశ్వరరావు సా॥ కిష్టాపురం అనువారలు మా కుటుంబ తప్పు చేసదని ఒక గ్రూపు ఏర్పాటు చేసి మా కుటుంబములో ఏ వివాహంనకు కులంలో ఎవరు వెళ్లిన కులంలో మా కుటుంబమును వివాహాది శుభకార్యములకు పిలిచినచో రూ. _2,000/-లు జరిమానాగా విధించుబడును అని గ్రూపులో ఉండబడిన సభ్యులందరకు వాట్సన్
లో పెట్టి మా కుటుంబ పరువు మా మనోబావలకు గురి అయి కుటుంబం ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిలో ఏర్పడుచున్నవి.
ప్రస్తుత ప్రజా జీవనంలో అన్ని కులాలు ఒక్కటే అన్ని పార్టీలు వారు ఒకటే అని మన స్వంతంత్రం వచ్చిన రోజులలో మనుష్యులంతా ఒకటే అని ఇందిరా గాందీ లాంటి వారు ముస్లిం కులస్తుడను చేసుకొని దేశ ప్రజాలంతా ఒకటే అని అనేక సాటిన మన దేశంలో పై విధముగా మానవత్వం మరిచి లేనిపోని సంఘ కట్టుబాటులు అని అధిక జరిమానాలు వసూలు చేయటం, వాటిని సంఘ కార్యాకలాపాలకు వాడకుండా వారి యిస్థానుసారముగా వాడుకోవటం పరిపాటి అయినది.
Also Read : టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు : బోర్డు చైర్మన్
కావున తమరు నా యందు దయవుంచి మా కుటుంబ పరువును తీసి మా కుటుంబము ఆత్మహత్యకు పాల్గడే విధముగా చేసిన పై తెలిపిన 13 మందిపై చట్టపరమైన తగుచర్యలు తీసుకొని మా కుటుంబ పరువు ప్రతిష్టను కాపాడగలందులకు కోరి మిక్కిలి ప్రార్ధించుచున్నాను.
తమవిధేయుడు
పెండ్ర గోపాలరావు
సెల్ : 9505312169.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube