చిరంజీవి ని వరించిన అదృష్టం

వైసిపి లో కీలక పదవి

1
TMedia (Telugu News) :

చిరంజీవి ని వరించిన అదృష్టం
– వైసిపి లో కీలక పదవి
టీ మీడియా,సెప్టెంబర్ 16,అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి చిరంజీవి నిజంగా అదృష్టవంతుడే. మొన్నటికి మొన్న తీవ్ర ఆవేదనతో తెలుగుదేశం పార్టీని వీడిన ఆయన అధికార పార్టీలో చేరారు.టీడీపీకి గుడ్‌బై చెప్పిన అతి కొద్దిరోజుల్లోనే ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.

Also Read : సిఎం ను కలిసిన దేవాదాయ శాఖ మంత్రి

ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్.. గంజి చిరంజీవికీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించారు.

ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆయనను చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఓ మంచి గుర్తింపు లభించిందనే అభిప్రాయం మంగళగిరిలో వ్యక్తమౌతోంది. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్నారు. వారిలో మెజారిటీలు పద్మశాలీయులే..

Also Read : మన ఊరు-మన బడి పను లు త్వరితగతిన పూర్తి చేయాల

ఇప్పుడదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి రాకతో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతమైనట్టే. అదే సమయంలో ఆయనను పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం అదనపు బలంగా మారినట్టయింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్టు మరింత పెరిగినట్టయింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube