టిఆర్ఎస్ పాలన లోనే మధిర అభివృద్ధి

కుట్టు మిషన్లు లను పేదలకు పంపిణీ

1
TMedia (Telugu News) :

టిఆర్ఎస్ పాలన లోనే మధిర అభివృద్ధి

-కుట్టు మిషన్లు లను పేదలకు పంపిణీ
టి మీడియా, మే9,మధిర : టిఆర్ఎస్ పాలనలోనే మధిర అభివృద్ధి సాధించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. సోమవారం మధిర లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం మల్లాది వాసు ఇంటివద్ద పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు మిషన్లు లను పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో మధిర లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఖమ్మం తరహాలో మధిరలో ట్యాంక్ బండ ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సమీకృత మార్కెట్ ఏర్పాటు సిమెంట్ రోడ్డు నిర్మాణం తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు గురుకుల పాఠశాల ఏర్పాటు ఆసరా పెన్షన్లు పెంచిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే నని ఆయన తెలిపారు రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తున్నామని, రైతులకు రైతు బంధు అందిస్తున్నాం అని ఆయన వివరించారు.

Also Read : అకాల వర్షం ఈదురుగాలులకు భారీగా పంట నష్టం

జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సూచనల మేరకు ఆధ్వర్యంలో మధుర పట్టణంలో లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎమ్మెల్సీ తాత మధు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత మల్లాది వాసు సవిత దంపతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube