ఎమ్మెల్సీ అభ్య‌ర్థి తాత మధు నామినేష‌న్ దాఖ‌లు

ఎమ్మెల్సీ అభ్య‌ర్థి తాత మధు నామినేష‌న్ దాఖ‌లు

0
TMedia (Telugu News) :

 

Bform giving seen
Bform giving seen

ఖమ్మం కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కి నామినేషన్లు అందించారు. తొలుత తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో అభ్యర్థి తాత మధు కి B౼Form ను మంత్రి పువ్వాడ అందజేశారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ..

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న తాత మధు గారి విజయం ఖాయం అన్నారు.
రైతు బంధువుగా ఉన్న సీఎం కెసిఆర్ గారి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు టిఆర్ఎస్ పార్టీకి మెండుగా ఉన్నాయన్నారు.
అందరి శ్రేయస్సు కోసం కెసిఆర్ గారు పని చేస్తున్నారని చెప్పారు. దేశంలోని రైతులకు న్యాయం చేసే విధంగా కెసిఆర్ గారి ఆలోచనలు, చర్యలు ఉన్నాయన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ ని ఒప్పించి, రైతుల కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టకుండా ఒప్పించాలి అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారని పిలుపునిచ్చారు. అభ్యర్థి తాత మధు గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలు సుపరిపాలన వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి, ప్రజల ఆదరాభిమానాలతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నిక అవుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాములు నాయక్ గారు, మెచ్చా నాగేశ్వరరావు , హరిప్రియ నాయక్ , జడ్పీ చైర్మన్లు లింగాల కమల్ రాజ్ కోరం కనకయ్య గారు, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube