సిపిఐ నాయకులను కలసిన నూతన ఎమ్మెల్సీ తాత మధు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 22, భద్రాచలం

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నూతనంగా ఎన్నికైన తాత మధుసూదన్ భద్రాచలం పర్యటనలో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, రావులపల్లి రవికుమార్ లను వారి స్వగృహంలో కలిసి భేటీ అయి శాలువాతో సత్కరించారు. అనంతరం రావులపల్లి రాంప్రసాద్ కూడ శాలువాతో తాత మధును సత్కరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భద్రాచలం డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని రావులపల్లి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కార్యదర్శి అకోజు సునీల్ కుమార్, బల్లా సాయి కుమార్, టీడీపీ లీగల్ అడ్వైసర్ కొడాలి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube