మద్యం అధిక ధరల తో పాటు బెల్టుషాపులను అరికట్టాలి-అన్ని రకాల బ్రాండ్లు “బెల్ట్” లోనే*

మద్యం అధిక ధరల తో పాటు బెల్టుషాపులను అరికట్టాలి-అన్ని రకాల బ్రాండ్లు "బెల్ట్" లోనే*-*

1
TMedia (Telugu News) :

మద్యం అధిక ధరల తో పాటు బెల్టుషాపులను అరికట్టాలి
-అన్ని రకాల బ్రాండ్లు “బెల్ట్” లోనే*-*
టిమీడియా ,ఏప్రిల్ 3 ,జూలూరుపాడు:మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపుల వారు సిండికేట్ గా తయారై మండలంలో అరాచకం సృష్టిస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం జూలూరుపాడు ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మద్యం షాపుల వారు సిండికేట్ గా తయారై మద్యం ధరలను విపరీతంగా పెంచి అమ్ముతున్నారని ప్రతి పల్లెలో బజార్ బజార్ వందల బెల్టుషాపులు వెలిసాయని బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా క్వార్టర్ బాటిల్ కు 20 నుండి పాతిక రూపాయల వరకు సిండికేట్ వారు అక్రమంగా, అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపుల వారు మరో 20 రూపాయలు అదనంగా వినియోగదారుల వద్ద నుండి వసూలు చేస్తున్నారని దీంతో 200 రూపాయల విలువగల క్వార్టర్ బాటిల్ వెల్ షాపులో 250 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని మంగీలాల్ ఆరోపించారు.

ALSO READ;విమాన గోపురానికి వెండి తోర‌ణం బ‌హుక‌ర‌ణ‌..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్సుడు మద్యం షాపులలో అన్ని రకాల బ్రాండ్ లు వినియోగదారులకు అందుబాటులో ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ALSO READ;చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్
మండల కేంద్రంలో ఉన్న ప్రధాన షాపుల్లో లేని బ్రాండ్లను స్టాక్ లేనట్టుగా సృష్టిస్తున్నారని అవే బ్రాండ్ లుబెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణం దారులు డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లను షాపు వద్ద అమ్మితే కేవలం ప్రభుత్వ అమ్మకం ధర మాత్రమే వస్తుందని అదే బెల్టుషాపులు వారికి ఇచ్చినట్లయితే ఒక క్వార్టర్ బాటిల్ కు అదనంగా 20 నుండి 25 రూపాయలు అక్రమ లాభం పొందుతున్నారని ఆరోపించారు. ఈ విధంగా కూడా బెల్టుషాపులు ప్రోత్సహిస్తున్నారని జూలూరుపాడు బార్ షాపుల వద్ద సాయంత్రం సమయం లో రోడ్డుపై వాహనాలు ఆపడంతో ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది కలుగుతుందని, ఈ దిశగా కూడా అధికారులు దృష్టి సారించాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో బెల్టుషాపుల నియంత్రణ కోసం ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నున్నా కృష్ణయ్య ,కిషన్ నాయక్, శ్రీనివాస రావు,గుగులోతు శ్రీను లు పాల్గొన్నారు.

ALSO READ;2నుంచి రంజాన్ మాసం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube