బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: సీఐ

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: సీఐ

0
TMedia (Telugu News) :

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: సీఐ
టీ మీడియా,ఏప్రిల్ 04,రామగుండం: కమిషనర్ ఎస్.చెంద్రశేకర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ ఆదేశానుసారం1టౌన్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం  బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో సాధారణ ప్రజలు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని అన్నారు.

ALSO READ;ఉగ్ర కలకలం ఐసిస్ సానుభూతిపరుడి అరెస్ట్

మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం,త్రాగిన మత్తులో నేరాలు చేయడం జరగుతుందని రోడ్లపై వెళ్లే మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని,మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.మళ్ళీ రెండవ సారి మద్యం సేవించి పట్టుబడినట్లైతే కేసులు నమోదు చేయడంతో పాటు జైలుకు పంపడం,జరుగుతుందని అన్నారు పట్టుబడిన 18 మందిపై కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.ప్రతి రోజు ఇదే విధంగా తనికీలు నిర్వహించడం జరగుతుందని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సైలు సుబ్బారావు,స్వామి,నరేష్ కుమార్,ఏ ఎసై మల్లయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ;వైద్యురాలినిఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేత అరెస్ట్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube