చింతూరు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.
సీపీయం జిల్లాకారుదర్శి టి. అరుణ్
ప్రజాశక్తి…. చింతూరు
చింతూరు మండల 8 వా మహా సభ మంగళవారం ఏడుగురాళ్లపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. తోలుత సీపీయం పార్టీ జండాను మల్లం సుబ్బమ ఆవిష్కరించారు. అమరవీరుల స్టూపాలకు. చిత్రపటాలకు పూలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పల్లపు వెంకట్ అధ్యక్షతన జరిగిన మహాసభకు సీపీ యం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడినారు. మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్లచెట్టాలకు వ్యతిరేకం గా రైతంగం పోరాటాలు చేసి మోడీ మెడలు వంచిన చరిత్ర క పోరాటం అని అన్నారు. అధికారం లోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తెచ్చి ప్రతి పేద. మధ్యతరగతి కుటుంబాల ఖాతాల్లో 15 లక్షలు వేస్తానని చెప్పి ఎ ప్రధాని కూడ ఇంతవరకు తిరగని 70 దేశాలు తిరిగి న ప్రధాని మోడీన్నారు. ఒక్కపైసా కూడ పేద. మధ్యతరగతి ఖాతాల్లో వేయక పోగా ఆదని. అంబాని లకు దేశాసొత్తు దోచి పెట్టి లక్షల కోట్ల రూపాయల లాభాలను పొందేలా మోడీ చేసాడన్నారు. రోజుకు వేయి కోట్లు లాభం పొందేలా సముద్రం లోని పైప్ లైన్ ద్వారా ఆదని ఓ. ఎన్. జి. సి సంస్థ నుండి చమురు. సహజవాయువు ను త రలించుపోయేలా మోడీ సహకరించడని అన్నారు.
ప్రజలకు మేలు చేయక పోగా ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే. టే లికామ్. విశాఖ ఉక్కు కర్మాగారం ను ప్రైవేటు పరం చేసే కుటిల ప్రయత్నం చేస్తుందన్నారు. దేశాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అమ్మివేసి దేశాన్ని దివాళాతీసే విదంగా విదనాలు తెస్తున్నడన్నారు. దేశంలో నిరీద్యోగం సమస్యలు పరిష్కరించాలని ప్రజాసంఘాలు పో రాటాలు చేస్తుంటే అనగ ద్రోక్కే పనులు చేస్తున్న మోడీ కి పోరాటాల ద్వారా కాను విప్పు తేవాలని పిలుపు నిచ్చారు.
అనంతరం మహాసభ లో ప్రవేశపెట్టిన తీర్మానాలను ఎఱ్ఱం శెట్టి శ్రీనివాస్ పేర్కొంటూ 2013 చట్టం ప్రకారం పోలవరం నిర్వశితులకు మెరుగైన పునరావాసం. ఏర్పాటు చేయాలని. వలస ఆదివాశీలకు రక్షణ కల్పించి ఎ. పి. పౌరు లుగా గుర్తించాలని. రైతుల నల్ల చట్టాల రద్దు కై పోరాడిన రైతు సోదరులకు జె. జె. లు తెలిపారు. అమరులైన రైతులకు నివాళులు అర్పించారు. పంటలకు కనీస మద్దతు ధర ను పార్లమెంట్ లో చట్టం చేయాలి .
నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలి . పోడు భూములకు సర్వే జరిపి అర్హులైన రైతులకు పట్టాలు అందజేయాలి.అనంతరం పి ఎన్. ఎం కళాకారులు పలు విప్లవ గేయాలు ఆలపించారు. ఈ సభకు కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నా గేశ్వరావు. ఎస్. ఎస్. మూర్తి. కుంజాసీతారామయ్య. జిల్లాకమిటీ సభ్యులు యర్రంశెట్టి శ్రీనివాస్ రావు. చింతూరు మండల కార్యదర్శి సిసం సురేష్. ఎటపాక మండల కారదర్శి ఐ. వి. మండల కారదర్శి వర్గ సభ్యులు మడకం చిన్నయ్య. మల్లం సుబ్బమ్మ. డేగల మాధవరవు. ఇర్ఫా అజయ్. అకిశెట్టి రాము. పొడియం లక్ష్మణ్. ఎంపీ టి సి. వెక. రాజకుమార్. ముర్రం లక్ష్మీ. తదితరులు పాల్గొన్నారు.
