మహానంది దేవస్థానం లో ఇద్దరు కాంట్రాక్టర్లపై వేటు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 13, మహానంది:

మహానంది క్షేత్రం లో ఇద్దరు కాంట్రాక్టర్లపై దేవస్థాన అధికారులు సోమవారం వే టు వేశారు.ఆదివారం రాత్రి మహానంది క్షేత్రం లో దైవ దర్శనార్ధమై వచ్చిన మహిళా భక్తులపైమరుగుదొడ్ల నిర్వాహకులు అసభ్య ప్రవర్తన మరియు ఫోటోలు చిత్రీకరిస్తున్న విషయాన్ని పసిగట్టిన మహిళలు గురించి దేహ శుద్ధి చేయడం క్షేత్రంలో చర్చనీయాంశంగా మారింది.గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.సెల్ఫోన్ మరియు సామాన్ల భద్రపరుచు గదుల వద్దు కూడా పలు ఆరోపణలు రావడంతో స్పందించిన అధికారులు ఇద్దరు కాంట్రాక్టర్లపై వేటు వేసి వాటిని స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంతవరకు ఏ అధికారి కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రస్తుతం చర్యలకు ఉపక్రమించడం వల్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .ఏది ఏమైనాభక్తులకు ఆటంకం కల్పిస్తే చర్యలు తప్పవనిఇలాంటి చర్యలే ఉంటాయని హెచ్చరించినట్లు అయింది .

Two Contractors hunted down at Mahanadi Temple.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube