రుణ విముక్తి పత్రాలు అందజేత ఎంపిపి
టీ మీడియా, డిసెంబర్ 10, మహానంది:
మహానంది మండలం పరిధిలోని యం. తిమ్మాపురం గ్రామ సచివాలయం ఆవరణంలో వన్ టైం సెటిల్మెంట్ పధకం క్రింద పులిమద్ది విజయ భాస్కర్, మందా నాగమ్మ లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద పది వేల రూపాయలు నగదు కట్టించుకుని రుణ విముక్తి పత్రాలను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కుమారి. బి. యశస్విని అందజేశారు. ఈసందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఓటియస్ పై అపోహలు లేకుండా గృహరుణ బకాయిలు చెల్లించి రుణ విముక్తిలో భవిష్యత్తు ప్రయోజనాలు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బ రాజు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఓటియస్ ప్రత్యేక అధికారి సుబ్బా రెడ్డి, పంచాయతీ సెక్రటరీ నాగ సంజీవ రావు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ నరసవేణి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.