మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ35,42 లక్షలు

మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ35,42 లక్షలు

1
TMedia (Telugu News) :

మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ35,42 లక్షలు

టీ మీడియా, జూన్ 23, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.35,42,589 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ప్రధాన ఆలయాల్లో భక్తులు 40 రోజులపాటు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బందితో లెక్కించామన్నారు. ఇందులో స్వామి, అమ్మవారి ఆలయాలలోని హుండీలతోపాటు ఇతర హుండీలను లెక్కింపు నిర్వహించగా రూ35,42,589 లక్షలు వచ్చిందని అన్నారు.

Also Read : మిట్ట కోల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలకలు, పుస్తకాలు పంపిణీ

అలాగే ఆలయాలకి 34,441,94 రూ అన్నదానికి రూ 6,8,801 వేలు, గోవు సంరక్షణకి 29,594 రూపాయలు వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున,ఏ ఈ ఓ మధు ,దేవాదాయ ధర్మాదాయ శాఖా గడివేముల గ్రూప్స్ ఈఓ ఏ నాగప్రసాద్, పి.వీరభద్రుడు, సూపరిండెంట్లు వెంకటేశ్వర్లు,ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఏజెన్సీ వర్కర్స్,ఆలయ సిబ్బందితోపాటు స్వచ్చంధ సేవకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube