మహానందిశ్వరుని సన్నిధిలో ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 26, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి మహానందిశ్వర స్వామి వారిని ఆదివారం ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ ఎం.సీతారామమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్ వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరీ, మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వేదపండితులు ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి, నంద్యాల రూరల్ సీఐ రవీంద్ర, మహానంది తహసీల్దార్ జనార్ధన్ శెట్టి, ఆలయ ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Shri kameshwari Devi Mahanandishwara Swamy was felicitated at the Mahanandi Shrine on Sunday along with the family members of AP Human Rights Commission.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube