టీ మీడియా, నవంబర్ 28, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ మహనందీశ్వర స్వామి వారి నిత్యాన్నదానాన పథకానికి ఆదివారం భక్తులు విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన మేకల గంగరాజు 10,116 రూపాయలు విరాళంగా అందజేశారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, డొనేషన్ ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డి అభినందించారు. వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను, అన్నదాన బాండు అందజేశారు.