మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శం
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
టీ మీడియా, అక్టోబర్ 28, వనపర్తి బ్యూరో : వాల్మీకి మహర్షి జీవితాన్ని ముందు తరాలకు తెలియజేయాలి. మనిషిలో మార్పు వస్తే మహర్షిలు అవుతారు. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నాగవరం వద్ద వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై వాల్మీకి సంఘం నాయకులతో కలిసి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం వేటగాడుగా ఉన్న వాల్మీకి దొంగగా మారి దారి దోపిడీలు చేశారని, ఆ తర్వాత నారద మహాముని దివ్యోపదేశంతో కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారన్నారు. ఆ తర్వాత రామాయణ కావ్యాన్ని రచించారని చెప్పారు. మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించింది వాల్మీకి మహర్షి అని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. వాల్మీకి మహర్షి జీవితం మానవులకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని ముందు తరాలకు తెలియజేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.
Also Read : వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ
కృషి ఉంటే మనుషులు మహర్షులవుతారని, వాల్మీకి మహర్షి చరిత్ర ఇందుకు నిలువెత్తు నిదర్శనమని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ , రీజనల్ అథారిటీ జిల్లా సభ్యులు ఆవుల రమేష్ , పరంజ్యోతి, శివ, వాల్మీకి సంఘం నాయకులు రవి కుమార్ నాయుడు, సునీల్ వాల్మీకి, మధులత తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube