పర్వదినాన పుణ్య స్థానాలు

పర్వదినాన పుణ్య స్థానాలు

0
TMedia (Telugu News) :

పర్వదినాన పుణ్య స్థానాలు

టీ మీడియా, ఫిబ్రవరి 18, జన్నారం: మండలంలోని బాదం పెళ్లి, ధర్మారం, చింతగూడెం, తపాలాపూర్ ,కలమడుగు గ్రామాలలో గల గోదావరిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు శనివారం ఉదయం నుండే పుణ్య స్థానాలు ఆచరించి మహాశివరాత్రి ఉపవాసాలు జాగారాలు ప్రారంభించారు.

అల్పాహార వితరణ..
మహాశివరాత్రి పర్వదినాన మండలంలోని గోదావరి నది పుణ్య స్థానాలకు విచ్చేసిన భక్తులకు తపలపుర్ గ్రామంలోనీ నది తీరంలో తపలాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్, బాదం పెళ్లి గోదావరి తీరంలో మహాన్ ఎంటర్ప్రైజెస్, ఉమాచంద్రిక సెలక్షన్స్ గోలి అంకయ్య,సతీష్ చంద్ర గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహార వితరణ పండ్లు అందించారు.

Also Read : అమరజీవి తులసికి ఘన నివాళి

పుణ్య స్థానాలకు విచ్చేస్తున్న భక్తులకు జన్నారం మండల ఎస్సై పోచంపల్లి సతీష్ ఆధ్వర్యంలో ఎటువంటి ఆటంకం కలగకుండా రహదారుల వెంబడి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా వెంట వెంటనే ట్రాఫిక్ లేకుండా చేశారు. ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేసిన పోలీసు సిబ్బందికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube