అన్నీ వింతలే ఈ ఆలయంలో..

అన్నీ వింతలే ఈ ఆలయంలో..

0
TMedia (Telugu News) :

అన్నీ వింతలే ఈ ఆలయంలో..

లహరి, ఫిబ్రవరి 18, ఆధ్యాత్మికం : సృష్టి లయ కారకుడు ఈశ్వరుడు లీలలే వేరు. అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వ రూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు. కాణిపాకంలో ఉండే వినాయకుడి ఆకారం పెరుగుతున్నట్టుగానే.. సూర్యాపేట జిల్లా మెళ్లచేర్వులో ఉన్న శివ స్వరూపమైన లింగం ఎత్తు కూడా పెరుగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఐదురోజుల బ్రహ్మోత్సవ జాతర వైభవంగా సాగుతోంది. తదిదం శైవ మాఖ్యాతం పురాణం వేదసమ్మితమ్‌.. నిర్మితం తచ్చివేనైన ప్రధమం బ్రహ్మ సంమ్మితమ్‌… ఈ శివపురాణం.. వేదంతో సమానమైనదంటారు. అలాంటి శివుడి మహాశివరాత్రి పర్వదినం ఈసారి శనిత్రయోదశి, శనివారం రోజు రావడం మరింత శుభప్రదమని చెబుతున్నారు పండితులు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాశివరాత్రితో శైవ క్షేత్రాలు అందంగా ముస్తాబయ్యాయి. మేళ్లచెరువు మండలంలో శంభు లింగేశ్వర స్వామి ఆలయం చాలా ప్రశస్తమైనది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవ రాజులు నిర్మించారు. స్వయంభువుగా వెలసిన శంభు లింగేశ్వర స్వామి ఇక్కడ పెరుగుతూ వస్తున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ఓ ప్రత్యేకత ఉంది. శివలింగానికి పైభాగంలో ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో నుంచి నీరు వస్తుంది. ఆ చోటు నుంచే పూజారులు నీరు తీసి భక్తులకు తీర్థంగా ఇస్తారు. అయితే అలా ఎన్నిసార్లు నీళ్లు తీసినా… వెంటనే మళ్లీ నిండిపోవటం కనిపిస్తోంది.

Also Read :  ఆర్థిక ఇబ్బందులా.. గ్రహ దోషాలా..

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివలింగం పాణ వట్టంతో కలిసి ఉంటుంది. అంతేకాదు.. ఈ ఆలయంలో మాత్రం శివలింగానికి మాత్రం పాణ వట్టం రెండు ప్లేట్లుగా ఉంటుంది. శివలింగం ప్రతి 60 ఏళ్లకు ఒకసారి అంగుళం పెరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి… మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదర పోకుండా (జాగరణ) తో మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది.
మహాశివరాత్రి సందర్భంగా ఐదురోజుల పాటు నిర్వహిస్తున్న జాతరలో పండుగ రోజు రాత్రి స్వామి వారి కల్యాణం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఈ జాతరలో ఎద్దుల పోటీ కూడా పెడుతున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube