జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
టీ మీడియా,డిసెంబర్ 21, పెద్దపల్లి :
జిల్లాలో నిర్వహించే సమక్క-సారలమ్మల జాతరకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజున రామగుండం లోని గోదావరి నది ప్రాంగణం,అంతర్గాం లోని గోలివాడ ప్రాంతంలో చేసే జాతర ఏర్పాట్ల స్థలాలను పరిశిలించి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరిఖని,ప్రాంతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమక్క – సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో తేది.16.02.2022 నుంచి తేది.18.02.2022 వరకు రెండు ప్రాంతాలలో జాతర నిర్వహించే అవకాశం ఉందని,సుమారు 4 నుంచి 5 లక్షలమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నదం కావాలని అన్నారు. జాతరకు విచ్చేసే భక్తులకు త్రాగునీరు అందించుటకు అవసరమైన ఏర్పాట్లు, మట్టితో ముంపు ప్రదేశం మొత్తం చదును చేయాలని తెలిపారు.సమక్క-సారలమ్మల గద్దెలు మరమత్తు చేయటం, నిర్మించటం,ప్రహారి గోడకు రంగులు వేయటం, మొక్కుబడి ఓడిబియ్యం భక్తులు వేయుటకు డ్రమ్ముల ఎర్పాటు చూసుకోవాలని తెలిపారు.
రామగుండం నగరపాలక సంస్థ జాతర జరిగే చోట పారిశుద్యం పాటించడం, గ్రౌండ్ శుభ్రపర్చాలని, వాటర్ ట్యాంకర్లతో భక్తులకు త్రాగునీరు అందించాలని, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మించాలని, ప్రతిరోజు చెత్తను శుభ్రపర్చుట,స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మించాలని, విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం నుండి ఉదయం వరకు నిరంతరాయంగా సాగేటట్లుగా చూడాలని,విద్యుత్ అంతరాయం కల్గకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని,గోదావరి నదిలొ నీరు ఎక్కువగా ఉన్నందున సేప్టి ఫెన్సీంగ్ ఎర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.గోదావరిలో నీరు అధికంగా ఉన్నందున పుణ్యస్నానాలు చేసేవద్ద గజఈతగాలను అందుబాటులో వుంచాలని, కలెక్టర్ సూచించారు.

జాతర జరుగు సమయమున విద్యుత్ అంతరాయం కల్గకుండా చూడాలని,అదనపు ట్రాన్సఫర్మర్లను,జనరేటర్లను అందుబాటులో వుంచాలని, విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం మేయర్ అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, సంబంధించిన అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.