సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు

సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు

టీ మీడియా,ఆగస్టు9,ఖమ్మం: జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా గౌరవ అధ్యక్షుడుతోటరంగారావుఆధ్వర్యంలో పిల్లిచెన్నకృష్ణ తోటలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు, అనంతరం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అభిమానుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేసి అందరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరంతోట దమయంతి ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి విచ్చేసిన మహిళలకు చీరలు పంపినిచేశారు, డాక్టర్ కూరపాటి ప్రదీప్ స్వచ్చందంగా నిర్వహిస్తున్న తలసేమియా వ్యాధిగ్రస్తుల హాస్పిటల్ లో మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దేవభక్తుని కిషిర్ బాబు,డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారు ప్రారంభించారు, సుమారు 50 మంది అభిమానులు ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు మాకు పండుగ రోజు లాంటిదని, జిల్లా వ్యాప్తంగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేసారు. మేము పదిమందికి తెలిసేలా సేవా కార్యక్రమాలు చేస్తుంటే మా అభిమాన నటుడు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయిస్తున్నాడు కానీ ఏ రోజు వాటి గురించి చెప్పుకోలేదు, ఇలాంటి వ్యక్తికి మేము అభిమానులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం, ఆయన ఇచ్చే స్పూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం వారి బాటలో పయనిస్తాం అని చెప్పారు.

 

Also Read : ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగరేద్దాం

 

ఈ సంవత్సరం పుట్టిన రోజు స్పెషల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ డూపర్ హిట్ మూవీ పోకిరి సినిమాను వేస్తున్నామని,అందులో భాగంగా సాయంత్రం శ్రీనివాస థియేటర్ లో పోకిరి సినిమా వేస్తున్నామని అదే విధంగా థియేటర్ సిబ్బందికి దుస్తుల పంపిణి కార్యక్రమం ,జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణ్, నగర అధ్యక్షుడు మునగాల బాలు, జిల్లా ఉపాధ్యక్షుడు చింతమల్ల గురుమూర్తి, నగర కార్యదర్శి మలోత్ రవి, కార్యదర్శి , సుధాకర్, వెంకన్న, పులిపాటి సంపత్, గౌతమ్, సంగెపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube