మహేశ్‌ బాబుకు మాతృవియోగం

మహేశ్‌ బాబుకు మాతృవియోగం

1
TMedia (Telugu News) :

మహేశ్‌ బాబుకు మాతృవియోగం

టీ మీడియా, సెప్టెంబర్‌ 28, హైదరాబాద్‌: తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకున్నది. హీరో మహేశ్‌ బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి శ్రీమతి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Also Read : నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ఇందిర మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇందిర అంతిమ సంస్కారాలను బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.


కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. రమేశ్‌ బాబు, మహేశ్‌ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. కాగా, ఇటీవలే మహేశ్‌ అన్న రమేశ్‌ బాబు మృతిచెందారు. ఇప్పుడు తల్లి ఇందిర మరణించడంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube