11న టెక్నికల్‌ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు మెయిన్స్‌ పరీక్ష

11న టెక్నికల్‌ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు మెయిన్స్‌ పరీక్ష

0
TMedia (Telugu News) :

11న టెక్నికల్‌ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు మెయిన్స్‌ పరీక్ష

టీ మీడియా, మార్చి 4, హైదరాబాద్ : పోలీస్‌ నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ పరీక్షలను పూర్తిచేసిన పోలీస్‌ ఉద్యోగాల నియామక బోర్డు టీఎస్‌ఎల్‌పీఆర్బీ తాజాగా టెక్నికల్‌ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్‌ తేదీలను ప్రకటించింది. ఈ నెల 11న ఎస్‌సీడీ ఎస్‌ఐఅభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) అభ్యర్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తుది పరీక్షను హైదరాబాద్‌లోని కేంద్రాల్లో నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.in కు మెయిల్‌ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నది. కాగా, మిగిలిన రెండు పరీక్షలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
వెబ్‌సైట్‌: https://www.tslprb.in/

Also Read : తెలంగాణ జన సమితి పోస్టర్ ఆవిష్కరణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube