మాజీ ఎమ్మెల్యే తాటికి మంత్రి పరామర్శ

మాజీ ఎమ్మెల్యే తాటికి మంత్రి పరామర్శ

1
TMedia (Telugu News) :

మాజీ ఎమ్మెల్యే తాటికి మంత్రి పరామర్శ
టి మీడియా,ఎప్రియల్ 27,సారపాక:
మాజీ ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మీ ఇటీవలే మృతి చెందిన విషయం విదితమే.
మంగళవారం సారపాక లోని వారి నివాసంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహాలక్ష్మీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తాటి వెంకటేశ్వర్లు గారిని పరామర్శించి, ఓదార్చారు.. విషాద ఘటన నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.సారపాక లో ఇటీవలే మృతి చెందిన బిక్కసాని భద్రయ్య గారి మృతి పట్ల మంత్రి పువ్వాడ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి కుమారుడు శ్రీనివాస్ ను కలిసి ఓదార్చారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
వారి వెంట ప్రభుత్వ విప్ రెగా కాంతా రావు గారు, డా. తెల్లం వెంకటరావు తదితరులు ఉన్నారు.

Also Read:ఎంసెట్‌ ద్వారా బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube