మహా సభను విజయవంతం చేయండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా వనపర్తి అక్టోబర్ 16 : మాదిగ ఉద్యోగుల జాతీయ ఐదవ మహా సభను విజయవంతం చేద్దాం అని అఖిలభారత మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల్ కృష్ణ అన్నారు. మదనపురం మండలంలో ఎంఈఎఫ్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, విహెచ్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మదనాపురం మండలంలో మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అఖిల భారత ఐదవ మహాసభ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. వనపర్తి జిల్లా మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కమిటీ నుంచి సహృదయంతో రక్తసంబంధీకులు అయినటువంటి మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విభాగంతో పాటు మాదిగ దండోరా మరియు విద్యార్థి విభాగం నాయకులు మరియు కార్యకర్తలు అందరు కూడా పేరుపేరునా ఆహ్వానం పలుకుతున్నాము. జాతి ముద్దుబిడ్డ లేనటువంటి ఉద్యోగుల విద్యార్థిని విద్యార్థులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులకు తెలియజేయడం ఏమనగా హైదరాబాద్ లో ఈ నెల 24న మాదిగ ఎంప్లాయిస్ ఐదవ జాతీయ మహాసభ నిర్వహించబోతున్నారు.

ఈ సభకు ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ తో పాటు విశిష్ట అతిథులుగా కేంద్ర ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు హాజరవుతున్నారు. ఐదవ జాతీయ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం లోని ముగ్గురు మంత్రులు ఆహ్వానం పలికి వారి ద్వారా ముందుకు పోతున్నామని వర్గీకరణ సాధన దిశగా అడుగులు వేయబోతున్న జాతీయ మహాసభ కరపత్రం విడుదల కు ముఖ్య అతిథులుగా గద్వాల కృష్ణ అఖిల భారత జాతీయ ఉపాధ్యక్షులు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై నిర్వహించవలసిందిగా పేరుపేరునా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గద్వాల కృష్ణ, వెంకటయ్య, కొమ్ము చెన్నకేశవులు, రాము, రజిత, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube