మహాసభలను విజయవంతం చేయండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా వనపర్తి అక్టోబర్ 26 : సిపిఎం పార్టీ జిల్లా మహా సభను విజయవంతం చేయండి అని వనపర్తి సిపిఎం పార్టీ కార్యదర్శి ఎండి.జబ్బార్ అన్నారు. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జబ్బార్ మాట్లాడుతూ నవంబర్ 13, 14 తేదీలలో అమరచింత మండల కేంద్రంలో పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని ఈ సభలకు కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ మాయ మాటలు మర్చిపోయింది. ఇప్పటికైనా ఉద్యోగ ప్రకటనలు చేసి ఉద్యోగాలు కల్పించాలని మరియు ఈ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పంటలు వేశారని ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం మీనా వేషాలు లెక్కిస్తూ ఉందని విమర్శించారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని మరియు కేంద్ర ప్రభుత్వం లక్ష 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొంటామని చెప్పడం విడ్డూరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్రప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మరియు గ్రామాలలో హరితహారం మొక్కలు పెంచే వాళ్లకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని మరియు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను విభజించి కార్మిక హక్కులను కాలరాస్తూ ఉందని విమర్శించారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్. రాజు, నాయకులు వెంకట్, చెన్నయ్య, రాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Make the CPM party district general assembly a success , said Vanaparthi CPM party secretary MD Jabbar.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube