బాల్య దశ నుండే పొదుపు అలవాటు చేసుకోవాలి

మేనేజర్ రమణ చైతన్య

1
TMedia (Telugu News) :

బాల్య దశ నుండే పొదుపు అలవాటు చేసుకోవాలి

 

– మేనేజర్ రమణ చైతన్య

 

టీ మీడియా, డిసెంబర్ 3, జన్నారం : బాల్య దశ నుండే పొదుపు అలవాటు చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కిష్టాపూర్ శాఖ మేనేజర్ రమణ చైతన్య అన్నారు. నాబార్డ్ వారి సౌజన్యం తో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రమణ చైతన్య మాట్లాడుతూ పది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బాలిక ఖాతా కలిగి ఉండాలని , 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అన్నారు.

Also Read : గురు స్వామికి ఘన సన్మానం

విద్యార్థులు వారి బాల్య దశ నుండే పొదుపు చేయడం అలవర్చుకోవడం చాలా ప్రయోజన దయకమని, అర్హత పొందిన వారందరూ ప్రధానమంత్రి జీవనజ్యోతి, బీమా ,సురక్ష బీమా పథకాలు చేపించుకొని బ్యాంకు నుండి పొందిన వ్యవసాయ స్వయం సహాయ సంఘ రుణాలను స్వయంగా చెల్లించడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ తో పాటు తిరిగి అధికరణాలు పొందవచ్చని ఇట్టి విషయాన్ని మీ మీ తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రధానోపాధ్యాయురాలు శ్రీవాణి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, బ్యాంకు సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube