18వ న ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయండి

జాతీయ పార్టీగా ఖమ్మం నుండే తొలి కేక

0
TMedia (Telugu News) :

18వ న ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయండి

-జాతీయ పార్టీగా ఖమ్మం నుండే తొలి కేక

-ఎంపీ వద్దిరాజు , జడ్పీ చైర్మన్ కమల్ రాజు

టీ మీడియా, జనవరి 11,ముదిగొండ : తెలంగాణ లో మళ్ళీబి ఆర్ ఎస్ దే అధికారం అని, పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండి కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు.

18వ తేదీన ఖమ్మం లో జరిగేపార్టీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బుధవారం వనంవారి కృష్ణాపురం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ముదిగొండ మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అందుకు నిదర్శనంగా నేడు కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు అంతా కోరుకుంటున్నారని తెలిపారు.

Also Read : సీపీ చర్యలు: అక్రమార్కుల్లో గుబులు

ముదిగొండ మండలంలోని మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube