బ్రాహ్మణ పరిషత్ లబ్ధిదారులకు చెల్లింపులు చేయించండి

-ఎన్నికల కమిషన్ కు ఏ బి ఎస్ ఐ ఎన్ లేఖ.

0
TMedia (Telugu News) :

బ్రాహ్మణ పరిషత్ లబ్ధిదారులకు చెల్లింపులు చేయించండి

-ఎన్నికల కమిషన్ కు ఏ బి ఎస్ ఐ ఎన్ లేఖ.

టి మీడియా,అక్టోబర్12,ఖమ్మం: తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ లోని వివిధ స్కీమ్ లు ద్వారా ఎంపిక చేసిన లబ్ది దారులు కు(అన్ గోయింగ్ స్కీమ్ లకు) తక్షణం వారి ఖాతాల్లో నగదు జమ చేయించాలి అని అఖిల భారత బ్రాహ్మణ (సర్వీస్) నెట్ వర్క్ హెల్ప్ లైన్ నుండి అధ్యక్షులు శనగ పాటి మురళి కృష్ణ గురువారం లేఖ రాశారు. ముఖ్యంగా విదేశీ విద్య,బెస్ట్ స్కీమ్ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అని పేర్కొన్నారు.లేఖ ను విడుదల చేసారు.

ది. 12-10-2023

శ్రీయుత తెలంగాణ ఎన్నికల కమిషనర్ గారికి

విషయం: ఆన్ గోయింగ్ లో ఉన్న తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ లబ్దిదారులకు డబ్బులు జమ అనుమతి గురించి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 2021-2022,2022-23 సంవత్సరం సంబంధించి బెస్ట్ స్కీమ్, విదేశీ విద్య కు ఆర్థిక సహాయం క్రింద లబ్దిదారులను ఎన్నికల షెడ్యూల్ కు 3 నుండి 6 నెలల ముందు లబ్ది దారులు ను ఎంపిక చేశారు. వారి ఖాతాల్లో డబ్బులు జమ చెయ్యలేదు.లబ్ధిదారులు అంత పేద కుటుంబాల వారు. డబ్బులు తమ ఖాతాల్లో జమ అవుతాయి అనుకొంటూ విదేశాల్లో ఉన్న విద్యార్థులు. ఎదురు చూస్తున్నారు. ఇంత లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పరిషత్ అధికారులు మేము ఇప్పుడు ఏమి చెయ్యలేము.

Also Read : వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల కాలనీని ప్రారంభించిన సీఎం జగన్‌

ఎన్నికలు అయిపోయిన తరువాత చూద్దాం అంటున్నారు.కావునా ఇప్పటి కే ఎంపిక పూర్తి అయి ఉన్నందున ఎంపిక అయిన బెస్ట్, వివేకానంద విదేశీ విద్య స్కీమ్ లబ్ది దారులు ఖాతాల్లో సమందిత మంజూరు మొత్తం జమ అయ్యే విధంగా ఆదేశించాలని కోరుతున్నాము.

ఇట్లు
శనగ పాటి మురళి కృష్ణ
అధ్యక్షులు
అఖిలభారత బ్రాహ్మణ (సర్వీస్)నెట్వర్క్ హెల్ప్ లైన్
పోస్టల్ కాలనీ రోడ్,మామీళ్ల గూడెం, ఖమ్మం. పిన్ : 507002
సెల్:8919710365,8498972434

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube