ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయండి
టీ మీడియా, డిసెంబర్ 2, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలోని 10వవార్డు నాగవరంలో ఆ వార్డు టీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్ద ముక్కుల రవి అధ్యక్షతన టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈనెల నాలుగో తారీఖున మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు విచ్చేయు సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది. మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం వనపర్తి పట్టణ కేంద్రంలోని 33 వార్డులలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యువకులు అభిమానులు ఉద్యమకారులు సభకు విచ్చేసి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోరారు.
Also Read : ముగ్గురు ఆబ్కారీ సీఐల సస్పెన్షన్
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫైట్ డైరెక్టర్, రాజనగరం సింగిల్ విండో అధ్యక్షులు విజయ్ కుమార్, నాగవరం సింగిల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి , నాగవరం సింగిల్ విండో డైరెక్టర్ చిన్నారెడ్డి , టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్ గౌడ్ సుధాకర్ సోషల్ మీడియా నాగరాజు రఘు నాయుడు వెంకటన్న, పెద్ద ముక్కుల మహేష్, కృష్ణయ్య సంపత్ తదితరులు పాల్గొన్నారు.