ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

ఎంపీ నామ, లింగాల కమల్ రాజ్, కొండ బాల కోటేశ్వరరావు

0
TMedia (Telugu News) :

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

– ఎంపీ నామ, లింగాల కమల్ రాజ్, కొండ బాల కోటేశ్వరరావు

టీ మీడియా, నవంబర్ 21, మధిర : బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..మంగళవారం మధిర నియోజకవర్గ కేంద్రం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగసభను నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఆత్కూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభ వేదికను హెలిపాడ్ ప్రాంతాన్ని మధిర బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజ్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, తదితరులు పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి సీఎం గా చూడాలన్న తపన ప్రజల్లో మెండుగా ఉన్నది అన్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతున్నారని విక్రమంలో రేపు అనగా మంగళవారం మధిరలో నిర్వహించనున్న సభకు ఆయన హాజరుకానున్నారని తెలిపారు.

Also Read : ప్రజా ఆశీర్వాద సభకు కదలాలి

మధుర నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేందుకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా ప్రకటించిన విధంగా ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు మధిర ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజుని గెలిపించుకోవలసిన ఆవశ్యకత బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని అన్నారు. ఇప్పటికే ప్రజల్లో సానుకూలమైన మద్దతు లభిస్తున్నదన్నారు. సీఎం పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో డిసిసిబి వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు చింత నిప్పు కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బండారు అంజన్ బాబు, మొండితోక జయాకర్, కరివేద సుధాకర్ రావూరి శ్రీనివాసరావు చిత్తర నాగేశ్వరరావు కనుమూరు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీను తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube