ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి
– బారాస నాయకులకు పిలుపునిచ్చిన ఎంపీ నామ
టీ మీడియా, నవంబర్ 7, అశ్వరావుపేట : నియోజవర్గ కేంద్రమైన అశ్వరావుపేట మండల పార్టీ కార్యాలయంలో మంళవారం ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 13వతేదీన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ను నియోజవర్గంలోని దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించనున్నారని అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గంలో సభలు పూర్తయ్యాయాని ఆ సభలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తండోపతడలుగా వచ్చారని,పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసి ఈ సారి కూడా అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనీ, దేశ వ్యాప్తంగా కేసీఆర్ పెట్టిన రైతు బంధు సంక్షేమ పథకం వైపు చూస్తున్నారనీ,ఒక్క రైతులకే లక్ష కోట్లా రూపాయలు రైతుల అకౌంట్ లో వేయడం జరిగిందనీ గుర్తుచేశారు. రైతులకు వ్యవసాయానికి 24 గంటల పాటు వచ్చిన విద్యుత్,రైతు బీమా,కళ్యాణి లక్ష్మీ,షాది ముభరక్ ఎలా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ ముఖ్యమంత్రి కే సాధ్యమయ్యాయనీ అన్నారు.
Also Read : శ్రీ చైతన్య పాఠశాలలో బి హెల్తీ, బీ హ్యాపీ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం
తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో కూడా లేవని కాంగ్రెస్ మాయమాటలు మోసపురిత మాటలు నమ్మవద్దని రైతుల ఆత్మహత్య పెరిగిందే కాంగ్రెస్ పాలనలోనే అని అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో నాయకులు కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో బారసా అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావు, కోటగిరి సీతారామస్వామి, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి పలువురు బారాస నాయకులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube