ఖతార్ నిర్బంధంలోని అధికారులను విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
ఖతార్ నిర్బంధంలోని అధికారులను విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
ఖతార్ నిర్బంధంలోని అధికారులను విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
– మంత్రి జైశంకర్
టీ మీడియా, అక్టోబర్ 30, న్యూఢిల్లీ : గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణదండన విధించిన విషయం తెలిసిందే. వారిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో బాధిత మాజీ అధికారుల కుటుంబాలను కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పరామర్శించారు. వారి విడుదల కోసం భారత్ అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తోందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ‘‘ఖతార్‌లో నిర్బంధించిన 8 మంది భారతీయుల కుటుంబాలతో ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశాం. కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను తెలుసుకున్నాం. వారి విడుదలకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తుందని భరోసా ఇచ్చాం. ఆ విషయంలో కుటుంబాలతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటాను” అని ఎక్స్ వేదికగా జైశంకర్ వెల్లడించారు. కాగా.. ఖతార్‌లో ఉరిశిక్షపడిన మాజీ నేవీ అధికారులు గతంలో భారత యుద్ధనౌకలకు నాయకత్వం వహించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ ‘దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్’లో పనిచేస్తున్నారు.
Also Read : మనీష్ సిసోడియాకు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
అయితే వారు గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ చెబుతోంది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా మరశిక్షపడిన వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, సీడీఆర్ అమిత్ నాగ్‌పాల్, సీడీఆర్ పూర్ణేందు తివారీ, సీడీఆర్ సుగుణాకర్ పాకాల, సీడీఆర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్ ఉన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube