టీ మీడియా, డిసెంబర్ 9, మహానంది:
మహానంది గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత గిరిజన ఆశ్రమ పాఠశాల నందు విద్యార్థులకు గురువారం నంద్యాల మలేరియా డిపార్ట్మెంట్ వేంకటేశ్వర్లు మలేరియా వ్యాధి పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల చుట్టు పరిశుభ్రంగా ఉన్నపుడే ఎలాంటి రోగాలు దరిచేరవని అన్నారు. గ్రామంలో మురికి లేకుండా చూడాలని నీటి తొట్లు, పాత టైర్లలో నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు పెరిగి మలేరియా వ్యాధికి దారితీస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.