మల్లన్న బ్రహ్మోత్సవాలు.. కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

మల్లన్న బ్రహ్మోత్సవాలు.. కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

0
TMedia (Telugu News) :

మల్లన్న బ్రహ్మోత్సవాలు.. కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

లహరి, జనవరి 22, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే జాతర.. తొమ్మిది వారాలపాటు కొనసాగనుంది. మొదటి ఆదివారంమైన నేడు ఆలయానికి భక్తులు పోటెత్తారు.

పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్నది. మొదటి ఆదివారాన్ని పట్నం వారం అంటారు. నేడు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌ భక్తులు పాల్గొంటారు కాబట్టి దానికి ఈపేరొచ్చింది. పట్నం సందర్భంగా ఆదివారం అధిక సంఖ్యలో నగరానికి చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేపడతారు. పట్నంవారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆ దీక్షలు విరమిస్తారు. స్వామి వారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు.

Also Read : అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి డిప్యూటీ తహసీల్దార్

నేడు లక్ష మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం, పట్నం వారం, లష్కర్‌వారం, మహా శివరాత్రి రోజున నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయవర్గాలు ఆలయం, రాజగోపురం, గదులకు రంగులు వేయించి సుందరంగా ముస్తాబు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube