హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

0
TMedia (Telugu News) :

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 19, హైదరాబాద్‌ : శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ.. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి హై కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్‌ 6న మల్లారెడ్డిపై చీటింగ్‌, అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తమకు వారసత్వంగా రావాల్సిన భూమి వచ్చేలా చేస్తామని మభ్యపెట్టి పీటీ సరెండర్‌ (ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం) చేశారని ఆరోపిస్తూ కేతావత్‌ భిక్షపతి అనే వ్యక్తి గత నెల 18న ఇచ్చిన ఫిర్యాదుపై శామీర్‌పేట పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు శ్రీనివాస్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, మధూకర్‌రెడ్డి, శివుడు, స్నేహా రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపై ఐపీసీ 420, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం-2015లోని 3(1)జీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 33, 34, 35లలోని 47 ఎకరాల 18 గుంటల భూమి రాజీ అనే మహిళ పేరిట ఉంది.

Also Read : అక్రమాస్తుల కేసులో తమిళనాడు మంత్రి దోషి

ఆమెకు భిక్షపతి సహా ఏడుగురు వారసులున్నారు. తమకు వారసత్వంగా చెందాల్సిన భూమి తిరిగి తమ అధీనంలోకి వచ్చేలా చేస్తామని నిందితులు మభ్యపెట్టారని.. తమకు తెలియకుండా గత నెల 3న మూడుచింతలపల్లి తహసీల్దార్‌ సమక్షంలో పీటీ సరెండర్‌ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube