కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి మల్లికార్జున్‌ ఖర్గే కైవసం

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి మల్లికార్జున్‌ ఖర్గే కైవసం

2
TMedia (Telugu News) :

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి మల్లికార్జున్‌ ఖర్గే కైవసం

టీ మీడియా,అక్టోబర్ 19, దిల్లీ: శతాధిక పార్టీ కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే కైవసం చేసుకున్నారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ ఖర్గే.. తన ప్రత్యర్థి శశిథరూర్‌పై ఘన విజయం సాధించారు. అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించగా.. బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా.. థరూర్‌కు మద్దతుగా 1072 మంది ఓటేశారు. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరా లు టీ మీడియా,అక్టోబర్ 19,దిల్లీ:అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం సాధించడంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో తాజా ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి హస్తం పార్టీ పగ్గాలు అందుకుంటున్నారు.

Also Read : బీజేపీలో చేరిన బూర నర్సయ్య గౌడ్

ఖర్గేకు థరూర్‌ అభినందనలు..

ఎన్నికల ఫలితాలపై శశిథరూర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేను అభినందిస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అనేది గొప్ప గౌరవంతో పాటు చాలా పెద్ద బాధ్యత అని, అందులో ఖర్గే విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఖర్గే తన రాజకీయ అనుభవంతో పార్టీని నూతన శిఖరాలకు తీసుకెళ్తారని విశ్వాసం ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె వెన్నుండి ధైర్యం చెప్పారని, అందుకు సోనియాజీకి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. అధ్యక్ష ఎన్నికలు తటస్థంగా జరిగేలా చూసిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల గుండెల్లో ఎన్నటికీ గుర్తుండిపోయే స్థానం ఉంటుందని కొనియాడారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube