మల్లు స్వరాజ్యం కన్నుమూత
టీ మీడియా,మార్చి 20,హైదరాబాద్: సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుమల్లు స్వరాజ్యం హైదరాబాద్ కేర్ వైద్యశాలలు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వీరి మరణానికి సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వీరి అంత్యక్రియలు ఆదివారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముది రెడ్డి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్వరాజ్యంజీవిత_విశేషాలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యంసూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారునుగడ,గడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.
Also Read : చైనాలో మళ్లీ కరోనా మరణాలు
మహిళ కమాండర్ గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తేపదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపు తో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube