ప్రజల నుండి ఫిర్యాదులు అందితే చర్యలకు సిద్ధం

ప్రజల నుండి ఫిర్యాదులు అందితే చర్యలకు సిద్ధం

1
TMedia (Telugu News) :

ప్రజల నుండి ఫిర్యాదులు అందితే చర్యలకు సిద్ధం

టీ మీడియా, జూలై 27, మహానంది:

మహానంది మండల పరిధిలోని తమ్మడపల్లె గ్రామంలో మంగళవారం రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వాలంటీర్లు సక్రమంగా పనిచేయాలని, అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది పని తిరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సేవాదృక్పథంతో పనిచేసి ప్రజల మన్నలు పొందాలని తెలిపారు.ఏమైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు.ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వమన్నారు.

 

 Also Read : కేజీబివి లో మెడికల్ క్యాంపు ఏర్పాటు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను గడప గడప తిరుగుతూ ప్రతి ఒక్కరికి వివరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని,తాసిల్దార్ జనార్దన్ శెట్టి, మండల వైసిపి నాయకులు, మహానంది ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube