మన ఊరు-మన బడి పను లు త్వరితగతిన పూర్తి చేయాల

మన ఊరు-మన బడి పను లు త్వరితగతిన పూర్తి చేయాల

2
TMedia (Telugu News) :

మన ఊరు-మన బడి పను లు త్వరితగతిన పూర్తి చేయాల

టీ మీడియా, సెప్టెంబర్ 16,ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడత చేపట్టిన పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో మన ఊరు-మన బడి పనుల మంజూరు, పనుల రికార్డు నమోదులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేసి, 425 పాఠశాలల్లో రూ. 58,77,80,137 ల ఖర్చు కాగల పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.

Also Read : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ

ఇందులో 1466 పనులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏఇల ద్వారా పనుల పూర్తిపై 207 పాఠశాలల్లో 323 పనులపై ఎంబి ల నమోదు పూర్తయిందన్నారు. ఇంజనీరింగ్ శాఖల వారిగా ఎంబి ల నమోదుపై ఆయన సమీక్షించారు. విద్యుత్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అన్నారు. లైట్లు, ఫ్యాన్ల బిగింపు చేయాలని ఆయన తెలిపారు. పూర్తయిన పనులకు వెంట వెంటనే ఎంబిల నమోదు పూర్తి చేసి, ఖర్చు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.కార్యక్రమం లో జిల్లా విద్యా శాఖ అధికారి యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, సత్తుపల్లి పంచాయతీ రాజ్ ఇ.ఇ. చంద్రమౌళి, సత్తుపల్లి అర్ అండ్ బి ఇ.ఇ. హేమలత,నాగశేషు, తనాజీ, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube