మనఊరు మన బడికి అవసరమైన ఇసుక సిద్ధం చేయాలి

అక్రమ రవాణా నిరోధానికి పటిష్ఠ చర్యలు

1
TMedia (Telugu News) :

మనఊరు మన బడికి అవసరమైన ఇసుక సిద్ధం చేయాలి

-అక్రమ రవాణా నిరోధానికి పటిష్ఠ చర్యలు

అర్హులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ అందేలా చర్యలు

-అధికారుల సమీక్షలో కలెక్టర్

టి మీడియా, జూన్ 25, జగిత్యాల ప్రతినిధి:
మన ఊరు మన బడి కింద అభివృద్ధి పనుల కోసం అవసరమైన ఇసుకను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణా, టీఎస్ బీపాస్, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు పై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో ఇసుక రవాణా నిబంధనల మేరకు మాత్రమే జరగాలని, అక్రమ రవాణాపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గత 7 రోజుల్లో 23 ఇసుక రవాణా వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇసుక రవాణా పై మండలాల వారీగా కలెక్టర్ చర్చించారు.

 

Also Read : దేశంలో కొత్తగా 15,940 కరోనా కేసులు

మన ఊరు మన బడి కింద మొదటి దశలో ఎంపికైన 274 పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి మనకు 22,243 క్యుబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని, జిల్లాలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు నుంచి సరఫరా చేసేందుకు ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు. పాఠశాలలో అభివృద్ధి పనుల పురోగతి ప్రకారం ఇసుక సరఫరా జరగాలని, మన ఊరు మన బడి పనులకు ఇసుక కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో అర్హులైన వారికి కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, కథలాపూర్ తహసిల్దార్ వద్ద 12, మేడిపల్లి తహసిల్దార్ వద్ద 10, గొల్లపల్లి తహసిల్దార్ వద్ద 9 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఎమ్మెల్యేల వద్ద 244 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, కోరుట్ల 27,గోల్లపల్లి లో 27, జగిత్యాల రూరల్ లో 21 పెండింగ్ లో ఉన్నాయని ,తహసిల్దార్లు సంబంధిత శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక శాసనసభ్యుల సమయం తీసుకొని ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 

Also Read : నార్వే నైట్‌ క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

ధరణి కేసులకు సంబంధించి జిల్లాలో 22 మ్యూటేషన్లు పెండింగ్లో ఉన్నాయని వీటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 210 ప్రదేశాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థల ఎంపిక చేసినప్పటికీ ఇప్పటి వరకు 40 గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనులు మాత్రమే గ్రౌండ్ కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం స్థలాల ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ స్థలాలైన పాఠశాలలు,ఐకేపీ కేంద్రాలను సైతం ఎంపిక చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. క్రీడా ప్రాంగణాల వల్ల నష్టం వచ్చే అవకాశాలు లేవని, దీని పై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ బి.ఎస్ .లత , ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, తహసిల్దార్, సంబంధించిన అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube