మన ఊరు మన బడికి ప్రజాప్రతినిధులు తోడ్పడునందించాలి

అడిషనల్ కలెక్టర్

1
TMedia (Telugu News) :

మన ఊరు మన బడికి ప్రజాప్రతినిధులు తోడ్పడునందించాలి

-అడిషనల్ కలెక్టర్

టీ మీడియా, జులై20, మధిర:

మన ఊరు – మనబడి, మనబస్తీ – మనబడికి సంబంధించిన మధిర నియోజకవర్గస్థాయి సమావేశం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా విద్యాశాఖఅధికారి యాదయ్య అధ్యక్షతన దెందుకూరు రోడ్ లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు జరిగింది.

Also Read : ముంపు గ్రామాలను సందర్శించిన అడిషనల్ డీజీపీ

ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి మొగిలి స్నేహలత మధిర నియోజకవర్గస్థాయి మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఐదు మండలాలైన మధిర, ఎర్రుపాలెం,బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించిన పాఠశాలలను మండలాల వారీగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఎస్ఎంసి చైర్మన్లు మరియు సర్పంచ్ లను వేదిక మీదకు పిలిచి వారి పాఠశాలల వర్క్ ప్రోగ్రెస్ ను తెలుసుకొని మన ఊరు – మనబడి పనులు వేగవంతం అయ్యేలా చేయాలని దీనికి ప్రధానంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని వారికి మండల స్థాయిలో ఎంపీడీవోలు ఎంఈఓ లు,ఏఈ లు మండల వారీగా సమీక్ష సమావేశాల ద్వారా వర్క్స్ మొత్తం త్వరితగతిన 100% పూర్తి చేయాలని సూచించడం జరిగింది.ఈ సమావేశంలో ఐదు మండలాల మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీడీవోలు, జడ్పిటిసిలు, మధిర మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మరియు ఐదు మండలాల మండల విద్యాశాఖ అధికారులు,5 మండలాల ఏ ఈ లు, జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ సిహెచ్ రామకృష్ణ తదితరులు హాజరు కావడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube