మంచికి మారుపేరు మంచికంటి

నేడు 28 వ వర్థంతి

2
TMedia (Telugu News) :

మంచికి మారుపేరు మంచికంటి
-500ల ఎకరాల భూమి పేదలకు దానం
-2 సార్లు ఖమ్మం ఎమ్మెల్యే
-చనిపోయే నాటి కి సొంత ఇల్లు లేదు
నేడు 28 వ వర్థంతి
టీ మీడియా,ఫిబ్రవరి07,ప్రత్యేక ప్రతినిధి

 

machikanti

ఎర్రగా,బుర్రగ ఉన్న ఆయనను చూడ గానే జగమెరిగిన బ్రాహ్మణుడు గుర్తుకు వస్తారు ,పంచె,చొక్కా,చేతికర్ర తో హుందా గాకనిపించే ఆ వ్యక్తి తుది శ్వాస విడిచే వరకు పేదల పక్షపాతి ఉన్న వ్యక్తి.వారసత్వం గా వచ్చిన 500ల ఎకరాలు పేదల కోసం ధారాదత్తం చేసిన ఆయన 2 సార్లు ఓటుకి నోటు ఇవ్వకుండానే ఎమ్మెల్యే అయ్యారు.చనిపోయే నాటికి ఉన్న సొంత ఇల్లు కూడా లేకుండా పోయింది.ఆయనే మంచికి మారు పేరుగా పిలువ బడే మంచికంటి రాంకిషన్ రావు.నేడు 28 వ వర్థంతి.

 

తెలంగాణ రైతాంగాసాయుధపోరాట యోధుడు,ఖమ్మం జిల్లా కమ్యూనిష్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు, సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు మంచికంటి రాం కిషన్ రావు తల్లి నగరంలో ని బ్రాహ్మణ బజారు లోని కల్వల వారి సమస్థానంలో చిన్న పాటి ఉద్యోగి.అమ్మ దెగ్గర ఉన్న ఎర్రటి బుల్లోడిని.ఖమ్మం రూరల్ మండలం ఖాసిరాజు గూడెం దొర 500ల ఎకరాల అసామి పిల్లలు లేరు అని దత్తత తీసుకొన్న రు.మనోడు మంచి చోటుకుచేరాడు అని అందరు భావించారు. చదువు కోసం పెంపుడు తండ్రి పంపితే ఆనాడే కమ్యూనిస్టు విధానం వంట పట్టించు కొన్నాడు.దత్తతు తండ్రి నుండి వచ్చిన 500ల ఎకరాలు కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం మేరకు పేదలకు ఇచ్చారు. ఖమ్మం నగరం లోని జమలాపురం కేశవరావు పార్కు(జహీర్ పుర)సమీపంలో ఉన్న ఇంటినిం2 వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు అమ్మి వేసుకొన్నారు. రోజుపిడికెడు మాత్రలు మింగితే తప్ప జీవించి ఉండ లేని ఆయన ఎమ్మెల్యే గా ఉన్న కాలం లో శ్రీనివాసనగర్ చివరన ప్రస్తుతం ఉన్న బెస్త కాలనీ లోని బావమరిది ఇంటి నుండి పాత బస్టాండ్ సమీపము లోని సిపిఎం (పాత సిపిఎం అఫిస్)కు మనవడి సైకిల్ ని స్వయంగా తొక్కుకుంటు వచ్చే వారు..బావ మరిది ఇంట్లో కాలం లో వాష్ రూమ్ లు లేవు. ఎమ్మెల్యే గా ఉండి కూడాఉదయాన్నే చెంబు తో బైటకు వెళ్లే వారు.ఆయన ఎంత నిరాడంబరంగా ఉండే వారు తెలియ చేస్తోంది. ప్రజాప్రతినిది అంటే ఎలా ఉండాలి అన్నది ఆనాడు మంచికంటి చూపించారు.తన పని తాను చేసుకొనే వారు.కనీసం పెక్కనే ఉండే భార్య సత్యవతి ని చెయ్య నిచ్చే వారు కాదు.

పోరాట స్ఫూర్తి..

తెలంగాణ సాయిద రైతాంగ పోరాట యోధుడు అయిన మంచికంటి నాటి నైజం ప్రభుత్వం కోరగరాని కొయ్య అయ్యారు. అక్రమము ద్రోహి ఇచ్చిన సమాచారం తోపట్టుబడ్డారు.ప్రస్తుత ఖమ్మం వెంకటగిరి గేట్ సమీపంలో ని పోలీస్ క్యాంపు కు విచారణ కు తీసుకు వచ్చి హింసించారు.మిగిలిన నేతలు వివరాలు రబట్టలేక పోయారు కోపంతో మళ్ళీ కొట్టారు..బ్రతికి ఉన్న మంచి కంటి చని పోయినట్లు నటించారు.ఆయనను క్రింద పడుకో బెట్టి పెక్కనే తుపాకులు పడవేసి పీడ పోయింది అని పోలీసులు ఎంజాయ్ లో మునిగిపోయారు. సమయ ము కోసం చూస్తున్న మంచికంటి ఒక్క ఉదుటున లేచి పెక్కనే ఉన్న తుపాకులు తీసుకొని పోలీస్ పై తిరగబడి తనతో ఉన్న అనుచరులు తో కల్సి తప్పించు కొని తిరిగి సాయుధ పోరాటము లోకిం పోయిన బ్రాహ్మణ బిడ్డ మంచికంటి.

విలక్షణ మైన మనస్సు

పేద కుటుంబంలో, పుట్టిఒకపెద్ద భూస్వామి కుటుంబానికి దత్తత వెళ్లారు.కానీ కొంతకాలం తరువాత కమ్యూనిష్టు వుద్యమానికి స్వచ్ఛందం గా దత్తత వచ్చారు.
డ్ మంచికంటితో ఎందరెందరికో ఎన్నెన్నో అనుభవాలు సాయుధ గేరిల్లా దళాల్లోనూ, జైలు జీవితంలోనూ, ప్రజా వుద్యమాలలోనూ,పార్లమెంటరీ వేదికల మీదనూ ఆయనతో పరిచయాలు ఉన్నవారికి ,ఆయన గురించివిన్నవారు కోందరైతే, ఆయన జీవిత పుటలను చదవగలిగినవారు మరికొందరు.
ఆయనది విలక్షణమైన వ్యక్తిగత ము. గ్రామంలోని,చుట్టుపక్క గ్రామాలలోని ప్రజలు ఆయన్ని ఆనవాయితీగా “దొరవారు” అనేపిలుస్తారు.కానీ “దొరతనం”తనలో ఏకోశాన కనిపించదు.నిరాడంబరతకి ఆయన మారుపేరు.ఏచెట్టు క్రీందనైనా,పంచపరుచు కొని కునుకు తీయగలరు.పెట్టిన కూరలోవుప్పు ఉన్నదా లేదా అన్నపట్టింపుఆయనకులేదు.ఆకలి తీరటానికి దొరికింది తినడమే.కుటుంబంలోసామాన్యులు తట్టుకోలేని దుర్ఘటనలు జరిగిననాడు ఆయనచలించలేదు.పార్టీ కార్యకర్తలే ఆ దుర్ఘటనలకు కారణమన్న అనుమానంవచ్చిన రోజుకూడా పార్టీపై ఆయనకున్న అచంచల విశ్వాసం చెదరలేదు.
పైకి ఎంతో ఆరోగ్యంగా, చిద్విలాసంగా,స్ఫురదూృపిగా కనిపించే మంచికంటి ఆరోగ్యం నిజానికి అంత మంచిదికాదు.మధుమేహం,రక్తపోటు,పైలేరియాసిస్,మూత్రపిండాలలోరాళ్లు,మూర్చలు,గుండెకుసం బంధించిన రక్తనాళాల వ్యాధి,ఆస్టియో అర్ధరైటిస్,కంటిశుక్లాలు ,వేటిని లెక్క చెయ్యని పట్టుదల పూటకు గుప్పెడు మాత్రలు మింగుతూ, అలుపెరగని కార్యక్రమాలలో వెనుకంజ వేయని వ్యక్తిత్వం.
ఇన్ని వ్యాధులతో సుధీర్ఘ మైన జైలుజీవితం ,జైళ్లలోనూ పోరాటం,సంవత్సరాల కారాగారవాసంలో కూడా నలుగురికి దైర్యం చెప్పగలిగిన మనోస్థయిర్యం.
ఆయన స్వభావానికి తగిన ఇల్లాలు శ్రీమతి సత్యవతమ్మ.నిత్యం భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేవారు.
అమెవిశ్వాసాలు అమెకున్నా మంచికంటి మాటేవేదం, ఆయన పార్టీకార్యకర్తలు తనకు ఆత్మబంధువులుగా చూసుకునేవారు,యింటి కివచ్చిన వారికి ఉన్నంతలో నిండు హృదయంతో ఆప్యాయంగా పలకరించి,అతిధ్యమిచ్చి మరిపంపేవారు.
మంచికంటి ఆమెను గురించి సన్ని హితులతో అంటుండేవారు “సర్వసంపదలూ ఉన్ననాడు నన్నెంత గౌరవంగా చూసిందో సర్వం త్యాగం చేసి పార్టీ ఇస్తున్న కొద్ది పాటి అలవెన్సుతో జీవిస్తున్న అంతే గౌరవంగా చూస్తుంది”అని.
ఆయన వ్యవసాయకార్మిక వుద్యమాన్నిశక్తివంతమైనసంఘంగా నిర్మించారు.ఆదేరీతిలో సిటును ముందు శ్రేణిలో నిలిపారు.మంచికంటి 1995 ఫిబ్రవరి 8 వతేదీన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో అస్తమించారు.9 ఫిబ్రవరి 1995- ఖమ్మం మున్నేటి ఒడ్డు న అంత్యక్రియలు జరిగాయి.

 

లుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు

మంచికంటి రాంకిషన్‌ రావు (అక్టోబరు 11, 1917 – ఫిబ్రవరి 8, 1995) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కమ్యూనిస్టు (రైతుసంఘం) నాయకులు, మాజీ శాసనసభ్యులు. రాంకిషన్‌రావు తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైళ్లపాలయ్యారు. వరంగల్‌ జైల్లో ఉన్నంతకాలం రేయింబవళ్లు కాళ్లూ చేతులకు బేడీలు వేయబడి అతి ఇరుకైన గదిలో శిక్ష అనుభవించారు. 1964లో సిపిఎం వైపు వచ్చిన ఆయన ప్రభుత్వ ఆగ్రహానికిగురై 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉండగానే ఆయన ప్రమాదకరమైన జబ్బున పడ్డారు. 1974లో అధిక ధరలకు నిరసనగా సిపిఎం ఇచ్చిన పిలుపునందుకుని నిర్వహించిన ఆందోళనకు నాయకత్వం వహించారని మరో కమ్యూనిస్టు యోధుడు చిర్రావూరి లక్ష్మీనరసయ్యతోపాటు అరెస్టు చేశారు.

పోలీసులు వారిద్ద‌రికీ బేడీలు వేయించి ఖమ్మం పురవీధుల్లో ఊరేగింపజేశారు. తర్వాత ఆ ఖమ్మం గడ్డపైనే చిర్రావూరి మున్సిపల్‌ ఛైర్మన్‌గా, రాంకిషన్‌రావు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. 1975లో ఎమర్జెన్సీలో కూడా రాంకిషన్‌రావును రాజమండ్రి, హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్ర కారాగారాల్లో నిర్బంధించారు. మళ్లీ ఆయనకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చారు. ఆ స్థితిలోకూడా ఆయనను గొలుసులతో మంచానికీ, కాలుకీ కట్టేసి హింసలపాల్జేశారు. సీపీఎంలో రాంకిషన్‌రావు ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. 1952లో అవిభక్త కమ్యూనిస్టుపార్టీలో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, 1964 నుంచి సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, 1972 నుండి రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు.

1971 నుండి 78 వరకూ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో అదే జిల్లాకు సిఐటియు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1982, 1985లో ఖమ్మం శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. రాంకిషన్‌రావుకు ఐదారేళ్ల వయసున్నప్పుడే వారి నాన్న చనిపోయారు. రాంకిషన్‌రావుకు ఓ అక్క, అన్న కూడా ఉన్నారు . పిల్లలు పెద్దవాళ్లయ్యే వరకూ వ్యవసాయం చేసుకొని ఫలసాయం అప్పుల కింద జమ చేసుకునేలా పొలాన్ని అప్పలవాళ్లకు అప్పగించి ఆ కుటుంబం ఖమ్మం వెళ్లిపోయింది. రాంకిషన్‌రావు తల్లి బ్రాహ్మణులకూ, వైశ్యులకూ మునేటి నుంచీ, ఖిల్లా బావి నుంచీ ప్రతిరోజూ పది బిందెల వరకూ మంచినీళ్లు మోసి వారిచ్చే కొద్ది కాసులతో కుటుంబాన్ని పోషిస్తుండేది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube