మల్యాల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మంద చిరంజీవి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 21, జగిత్యాల:

జగిత్యాల జిల్లాలోని మల్యాల టౌన్ ఎస్సైగా ఆదివారం మంద చిరంజీవి
బాధ్యతలు చేపట్టారు జిల్లా ఎస్పి సింధూశర్మ ఇటీవల జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు మంద చిరంజీవి బాధ్యతలు స్వీకరించి రికార్డులలో నమోదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరి రక్షణకు కృషి చేస్తానని అన్నారు రాజకీయాలకు ఆతీతంగా ప్రజలకు న్యాయమైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు అన్ని వర్గాల ప్రజలను రాజకీయ నేతలను ప్రజా ప్రతినిధులను కలుపుకోని పోతూ ఈ ప్రాంత ప్రజల మెప్పు పొందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు.

జగిత్యాల జిల్లాలోని బుగ్గారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లలో సిసిఎస్ లో ఎస్సై గా సక్రమంగా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొంది ప్రజల నుండి మెప్పు పొందిన పోలీస్ అధికారిగా మంద చిరంజీవి నిలిచారు మల్యాలలో కూడా అంతకంటే ఉన్నతమైన సేవలు అందించి ప్రజల నుండి ప్రజా ప్రతినిధుల నుండి ప్రముఖుల నుండి ఉన్నతాధికారుల నుండి మరింత మెప్పు పొంది ఎస్సై చిరంజీవి ఉన్నత స్థాయికి ఎదగాలని మనమంతా కోరుకుందాం అని స్థానిక నేతలు పిలుపునిచ్చారు.

Manda Chiranjeevi Who took has charge as the Malayalam SI. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube